Posts

Showing posts from February, 2025

ఆత్మ ఏమిటి?

Image
  ఆత్మను ఎలా అర్థం చేసుకోవాలి? గీతలో నిర్వచనం ఆత్మ గురించి మన గీతా శాస్త్రంలోని సాంఖ్యయోగంలో చాలా చక్కటి వివరణ ఉంది.  (అ) సూక్ష్మమైనది, తడవదు, కాలదు, భేదింపబడదు, అగ్రాహ్యం, అచింత్యం…వగైరాలు. ఈ ఆత్మనే…పరమాత్మ అని కూడా చెప్పింది. ఇవన్నీ ఆత్మయొక్క ధర్మాలుగా తెలుస్తుంది కానీ, స్పష్టంగా ఆత్మ అంటే తెలియదు.  ఈ ధర్మాలతో పాటు గీతలోనే ఈ ‘ఆత్మ’ అన్న పదము, దేహము, మనస్సు, బుద్ధి అని చెప్పటానికి కూడా వాడబడింది, విషయం మరింత అస్పష్టం అయ్యింది. వేరే పదాలు (మనస్సు, బుద్ధి, చిత్తము, దేహము అంటూ) ఉండగా ఈ పదము ఎందుకు వాడవలసి వచ్చిందో నాకు తెలిసి ఎక్కడా చెప్పలేదు. బహుశా ఛందస్సుకు లోబడి అలా చేశి ఉండవచ్చును.(ఛందస్సు - ఇదేమిటి? గీతలో ఒకటి రెండు తప్ప అన్నీ శ్లోకాలే: శ్లోకానికి నిర్వచనమేమటంటే, రెండు పాదాలుండి, ప్రతి పాదంలో 16 అక్షరాలుండాలి. ఆ క్రమం కోసం -అవసరమైనప్పుడు మనస్సు, దేహం, బుద్ధి ఉండవలసిన చోట- ఆత్మ పదాన్నే వాడారేమో. మరి పూర్వంలో, ఇందువల్లన చదువరులకు ఇబ్బందిలేదా అంటే, పూర్వ కాలంలో గురుకులాలలో గురువు దగ్గరుండి అన్నీ బోధించేవాడు కనుక అనుమానాలొస్తే తొలగి పోయేవి. పైగా గురుకులాలలో రాజులు, బ్రాహ్మ...