Posts

ఆత్మ ఏమిటి?

Image
  ఆత్మను ఎలా అర్థం చేసుకోవాలి? గీతలో నిర్వచనం ఆత్మ గురించి మన గీతా శాస్త్రంలోని సాంఖ్యయోగంలో చాలా చక్కటి వివరణ ఉంది.  (అ) సూక్ష్మమైనది, తడవదు, కాలదు, భేదింపబడదు, అగ్రాహ్యం, అచింత్యం…వగైరాలు. ఈ ఆత్మనే…పరమాత్మ అని కూడా చెప్పింది. ఇవన్నీ ఆత్మయొక్క ధర్మాలుగా తెలుస్తుంది కానీ, స్పష్టంగా ఆత్మ అంటే తెలియదు.  ఈ ధర్మాలతో పాటు గీతలోనే ఈ ‘ఆత్మ’ అన్న పదము, దేహము, మనస్సు, బుద్ధి అని చెప్పటానికి కూడా వాడబడింది, విషయం మరింత అస్పష్టం అయ్యింది. వేరే పదాలు (మనస్సు, బుద్ధి, చిత్తము, దేహము అంటూ) ఉండగా ఈ పదము ఎందుకు వాడవలసి వచ్చిందో నాకు తెలిసి ఎక్కడా చెప్పలేదు. బహుశా ఛందస్సుకు లోబడి అలా చేశి ఉండవచ్చును.(ఛందస్సు - ఇదేమిటి? గీతలో ఒకటి రెండు తప్ప అన్నీ శ్లోకాలే: శ్లోకానికి నిర్వచనమేమటంటే, రెండు పాదాలుండి, ప్రతి పాదంలో 16 అక్షరాలుండాలి. ఆ క్రమం కోసం -అవసరమైనప్పుడు మనస్సు, దేహం, బుద్ధి ఉండవలసిన చోట- ఆత్మ పదాన్నే వాడారేమో. మరి పూర్వంలో, ఇందువల్లన చదువరులకు ఇబ్బందిలేదా అంటే, పూర్వ కాలంలో గురుకులాలలో గురువు దగ్గరుండి అన్నీ బోధించేవాడు కనుక అనుమానాలొస్తే తొలగి పోయేవి. పైగా గురుకులాలలో రాజులు, బ్రాహ్మ...

సంయమం

లౌకిక   విషయాలను   విసర్జించి ,  సంయమం   చేయటమే   అలౌకిక   జీవనం .  సంయమం   అనేది   ధారణ ,  ధ్యాన ,  సమాథి   ప్రక్రియల  యోగమే   సంయమం .  అనేక   విషయాల నుంచి ,  అలౌకికమైన   పరమాత్మే   ఏకైక   దృష్టి   కలిగించటమే   సంయమం   ప్రక్రియ . ఉదాహరణకి   పరమాత్మను  “ అ ” ( ఓం )  అనే   అక్షరం   సూచిస్తుందనుకుందాం, మిగిలిన అక్షరాలు “లౌకికాన్ని” సూచిస్తున్నట్లు. ధారణ, ధ్యాన, సమాథి ప్రక్రియలలో అక్షరాలతో అనుభవం ఎలాగుంటుందో చూద్దాం. ధారణ వ్యావహారిక   జీవనంలో   ధారణ   చేస్తున్న   కొద్దీ   చిత్తంలో  “ అ ”  నాటుకుంటూ   ఉంటుంది ,  ఇలా …అప్పుడప్పుడు “అ” (పరమాత్మ) స్మరణకు వస్తుంది… 👇🏻 అ మ య క ఢ అ ప ఆ న ఊ ఱ ఏ ే డ ఇ అ ఖ ఠ ృ ల జ ఉ థ ఓ ధ్యానం ధారణ   చేస్తున్న   కొద్దీ   చిత్తంలో   ధ్యాస   పెరిగి  “ అ ”  ఇంకా   బలంగా   నాటుకుంటూ   ఉంటుంది ,  ఇలా …  ఎక్కువ సార్లు “అ” (పరమాత్...