సంయమం
లౌకిక విషయాలను విసర్జించి, సంయమం చేయటమే అలౌకిక జీవనం. సంయమం అనేది ధారణ, ధ్యాన, సమాథి ప్రక్రియల యోగమే సంయమం. అనేక విషయాల నుంచి, అలౌకికమైన పరమాత్మే ఏకైక దృష్టి కలిగించటమే సంయమం ప్రక్రియ.
ఉదాహరణకి పరమాత్మను “అ” (ఓం) అనే అక్షరం సూచిస్తుందనుకుందాం, మిగిలిన అక్షరాలు “లౌకికాన్ని” సూచిస్తున్నట్లు. ధారణ, ధ్యాన, సమాథి ప్రక్రియలలో అక్షరాలతో అనుభవం ఎలాగుంటుందో చూద్దాం.
ధారణ
వ్యావహారిక జీవనంలో ధారణ చేస్తున్న కొద్దీ చిత్తంలో “అ” నాటుకుంటూ ఉంటుంది, ఇలా…అప్పుడప్పుడు “అ” (పరమాత్మ) స్మరణకు వస్తుంది…👇🏻
అ | మ | య | క | ఢ | అ |
ప | ఆ | న | ఊ | ఱ | ఏ |
ే | డ | ఇ | అ | ఖ | ఠ |
ృ | ల | జ | ఉ | థ | ఓ |
ధ్యానం
ధారణ చేస్తున్న కొద్దీ చిత్తంలో ధ్యాస పెరిగి “అ” ఇంకా బలంగా నాటుకుంటూ ఉంటుంది, ఇలా… ఎక్కువ సార్లు “అ” (పరమాత్మ) స్మరణకు వస్తుంది…👇🏻…👇🏻
అ | మ | య | అ | ఢ | అ |
ప | ఆ | న | ఊ | ఱ | అ |
ే | అ | ఇ | అ | ఖ | ఠ |
ృ | ల | అ | ఉ | థ | అ |
సమాథి
సాథన చేస్తున్న కొద్దీ చిత్తంలో ధ్యాస పెరిగి “అ” ఇంకా బలంగా నాటుకుంటూ ఉంటుంది, సాథకుడు సమాథి స్థితిలోకిచేరుకుంటాడు. చిత్తంలో “అ” మాత్రమే నాటుకుని ఉంటుంది, ఇంకేమీ విక్షేపాలూ ఉండవు, ఇలా……👇🏻
అ | అ | అ | అ | అ | అ |
అ | ఆ | అ | అ | అ | అ |
అ | అ | అ | అ | అ | అ |
ృ | అ | అ | అ | అ | అ |
“ృ” అన్నది తప్పుకాదు. సమాథిలోనూ స్థాయిలు ఉన్నాయి. సబీజ, నిర్బీజ సమాధులని.
సంయమం =ధారణ+ధ్యానం+సమాథి అన్న 3 అంగాల క్రమసంగమం.
సాధన ముందుగా ధారణలో ఎక్కువ కాలం, కొంత కాలం ధ్యానంలో, అతి కొద్ది మాత్రం సమాధిలో సాగుతుంది. కాలక్రమేణసాధకుని సాధనా కాలం త్వరగా ధారణ నుంచి ధ్యానంలోకి చేరగలడు, ఎక్కువ సేపు ధ్యానంలో ఉండగలడు. మరింత సాధనతోవేగంగా ధ్యానంలోకి చేరి, మరి కొంత సేపటికి సమాథిలోకి చేరగలడు. సాధన త్రీవ్రత తక్కువ ఉన్నప్పుడు, సాధకుడు సమాథినుంచి ధారణలోకి జారిపోగలడు. అందుకే తిరిగి తిరిగి సాధన చేస్తూండాలి.
సమాధిలో స్థితిడవుతున్న కొలది, సాధకుడు ఏ విషయం పట్ల ధారణ, ధ్యానం చెయ్యాలనికుంటాడో ఆ విషయం పట్ల వేగంగానేసమాథిలోకి చేరగలడు. ఆ విషయం వస్తువు, దృశ్యం, జ్ఞాపకం, అనుభవం, మానసిక, బౌధికము ఏదైనా కావచ్చును. సంయమం ఏ విషయము పైన అయినా చెయ్యవచ్చును. ఉదాహరణకు పరమాత్మ “ఓం” అన్న ఏకాక్షరం కావచ్చును, కళ్ళెదుటిజగత్తు, మనస్సులోని విశ్వమూ ….. ఏదైనా కావచ్చును.
Comments
Post a Comment